CM Chandrababu : పింఛన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు : సీఎం చంద్రబాబు
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. "ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం.
- By Latha Suma Published Date - 04:13 PM, Sat - 1 March 25

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు. “గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాం” అని చంద్రబాబు వివరించారు.
Read Also: Poasani Krishna Murali : పోసానికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు !
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. “ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచాం. కిడ్నీ, తలసీమియా రోగులకు రూ.10వేలు ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదల్లేని వారికి రూ.15వేలు ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని చంద్రబాబు వివరించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో తిరగాలని, అధికారులకు ప్రజల బాధలు అర్థం కావాలంటే వారి మధ్య ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు. “ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు” అని చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.