Cock Fighting : సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ.. స్పెషల్ ఫుడ్‌తో ట్రైనింగ్.. హైరేంజులో రేట్లు
ఇప్పటి నుంచి సంక్రాంతి పండుగ దాకా ఏపీలోని గోదావరి జిల్లాల పరిధిలో దాదాపు 8వేలకుపైగా కోడిపుంజుల(Cock Fighting) విక్రయాలు జరుగుతాయని అంచనా.
- By Pasha Published Date - 10:26 AM, Sat - 7 December 24

Cock Fighting : సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలకు వెరీ స్పెషల్. అక్కడ జరిగే కోడి పందేల రేంజే వేరు. బాదం, పిస్తాలు తినిపించి మరీ పెంచే కోడిపుంజుల మధ్య జరిగేే పొట్లాటలు రసవత్తరంగా ఉంటాయి. ఈక్రమంలో ఔత్సాహికులు పెద్ద మొత్తంలో బెట్టింగులు కడుతుంటారు. సంక్రాంతి టైంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో కోడిపందేల పేరుతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయట.
Also Read :Bharat Net : ‘భారత్ నెట్’ విప్లవం.. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్.. రేపే శ్రీకారం
పందేలలో వినియోగించే కోడి పుంజుల రేట్లు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. కోడి పుంజు పోరాడే విధానం, రంగు, ఎత్తు ఆధారంగా రేటు డిసైడ్ అవుతుంది. నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, రసంగి, సీతువ వంటి జాతులకు చెందిన రెండేళ్ల కోడిపుంజులను పందేలకు వాడుతుంటారు. ఒక్కో కోడి పుంజు ధర కనిష్ఠంగా రూ.25 వేల నుంచి మొదలవుతుంది. కొందరైతే మంచి కోడిపుంజును కొనేందుకు లక్షలాది రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోతుంటారు. ఇప్పటి నుంచి సంక్రాంతి పండుగ దాకా ఏపీలోని గోదావరి జిల్లాల పరిధిలో దాదాపు 8వేలకుపైగా కోడిపుంజుల(Cock Fighting) విక్రయాలు జరుగుతాయని అంచనా. కోడిపుంజుల సేల్స్ విలువ దాదాపు రూ.30 కోట్ల దాకా ఉంటుందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read :Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకుల మృతి
పందేలకు వాడే కోడిపుంజులకు ఉడకబెట్టిన గుడ్లు, ఉడికించిన మటన్, బాదం, జీడిపప్పు, రాగులు, సజ్జలు వంటి ఫుడ్స్ తినిపిస్తారు. కోడి పుంజులకు కోపం పెరగడానికి అశ్వగంధ పొడిని నీటిలో కలిపి తాగిస్తారు. వాటికి వాతం రాకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి తినిపిస్తారు. పందేలకు 90 రోజుల ముందు కోడి పుంజులకు ఇదే తరహాలో పకడ్బందీ ఫుడ్ మెనూను అమలు చేస్తారు. స్నానానికి, తాగేందుకు కేవలం వేడి నీళ్లను అందిస్తారు. వారానికి ఒకసారి నీళ్లలో ఈత కొట్టిస్తారు. వేగంగా తరుముతూ వాటిని పరుగెత్తిస్తారు. ఈవిధంగా ఒక పందెం కోడిని రెడీ చేసేందుకు దాదాపు రూ.33వేల దాకా ఖర్చవుతుందట. ఏపీలోని పలు ఆయిల్‌పాం తోటలు, చెరువు గట్లు, పొలాలు తదితర ప్రాంతాల్లో వీటిని పెంచుతుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దాదాపు 400 పందెం కోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలవారు, విదేశాల్లో ఉన్నవారు ఈ పెంపకం కేంద్రాల వాళ్లకు వీడియో కాల్ చేసి.. ఆన్‌లైన్‌లోనే కోడి పుంజులను చూసి ధరలు మాట్లాడుకుంటారు. అడ్వాన్సు చెల్లించి పుంజులను పందేనికి రెడీ చేయమని చెబుతారు.