RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
- Author : Sudheer
Date : 27-12-2023 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు స్వయంగా డీజీపీ ఆఫీస్ కు వెళ్లి తనను చంపేందుకు రూ. కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోాలని పిర్యాదు చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. కాగా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ నారా లోకేశ్ కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. రేపు దీనిపై కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.
Read Also : Meera Chopra : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్న పవన్ ‘బంగారం’ హీరోయిన్..