Meera Chopra : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్న పవన్ ‘బంగారం’ హీరోయిన్..
మీరా చోప్రా ఓ ఇంటర్వ్యూలో.. మీ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడగడంతో తన పెళ్లి గురించి మాట్లాడింది.
- By News Desk Published Date - 07:00 PM, Wed - 27 December 23

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బంగారం(Bangaram) సినిమాలో మీరా చోప్రా(Meera Chopra) నటించిన సంగతి తెలిసిందే. మీరా చోప్రా తమిళ్, తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. వాన సినిమాలో ఓ సాంగ్ తో బాగా పాపులర్ అయింది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తుంది. త్వరలో ‘సఫేద్'(Safed) అనే సినిమాతో హిందీలో రాబోతుంది మీరా చోప్రా.
ఇక మీరా చోప్రా బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు సోదరి కూడా అవుతుంది. తాజాగా సఫేద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. మీ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడగడంతో తన పెళ్లి గురించి మాట్లాడింది.
మీరా చోప్రా మాట్లాడుతూ.. నా పెళ్లి వార్తలు నిజమే. 2024 ఫిబ్రవరిలో నా పెళ్లి జరగనుంది. రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. నా పెళ్లి రాజస్థాన్ లో మా ఫ్యామిలిలు, సన్నిహితుల మధ్య జరుగుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ కోసం ముంబైలో రిసెప్షన్ నిర్వహిస్తాం అని తెలిపింది. అయితే మీరా చోప్రా ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో ప్రకటించలేదు. గత కొన్నేళ్లుగా మీరా ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు, అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో 40 ఏళ్ళ వయసులో మీరా ప్రేమ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది.
Also Read : Hanuman: హనుమాన్ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్