Results Of AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నాయి..?!
- By Gopichand Published Date - 10:49 AM, Sat - 1 June 24

Results Of AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Results Of AP Elections) మీద గతంలో ఎప్పుడు లేనటువంటి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రావడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద ఒక సరైన ప్రిడిక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే, కొన్ని సర్వేలు సంస్థలు వైస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే..మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం ఖచ్చితంగా 110 సీట్లతో కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.
అంతే కాకుండా..వైస్సార్సీపీ ఈ ఎన్నికలో ఒక అడుగు ముందుకుకేసి మళ్ళీ అధికారంలోకి వస్తుందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 9 వైజాగ్ లో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, వైస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు..టీడీపీ నేతలు కూడా అదే చెప్పుకొస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిమీద ఇరు పార్టీ నేతలు వాళ్ల వాళ్ల అభిప్రాయాలూ చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ తలలు పట్టుకునేటటువంటి పరిస్థితి నెలకొంది.
సాధారణంగా ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే..ఒక నెల రెండు నెలల ముందు ఎన్నికల ఫలితాల గురుంచి ఒక వేవ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉండేది. కానీ, ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తదనేది చెప్పకపోయినా..మెజారిటీ పబ్లిక్, మెజారిటీ సర్వే సంస్థలు గాని ఒక పార్టీ అధికారంలోకి వస్తది అనేది చెప్పడం గతంలో జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఏపీలో మాత్రం ఏ సర్వే సంస్థ కూడా సరిగ్గా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నదీ.
Also Read: Switch Board Cleaning : ఈ చిట్కాలతో.. బ్లాక్ స్విచ్ బోర్డ్‌ని తెల్లగా మార్చండి..!
కానీ, కొన్ని సంస్థల ఇచ్చినటటువంటి సర్వేలు చూసుకున్నట్లైతే..వైస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్తూ..కొన్ని చోట్ల మాత్రం దాదాపు ఒక 20 నుంచి 25 సీట్లు మధ్య వైస్సార్సీపీకి కూటమికి పోటాపోటీ ఉంటుందని..ఈ టైట్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో వారే రాష్ట్రంలో అధికారం చెల్లాయిస్తారని..ఇలా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ పెడుతునటివంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇకపోతే దుబాయిలోని ఓ మ్యూజియంలో AI తో పని చేసే రోబో ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తోంది. అయితే, ఏపీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దాని పై ప్రశ్న అడగగా..నాకు ఒకవేళ ఎవరు గెలుస్తారనేది తెలిసిన కూడా దానిని సీక్రెట్ గా ఉంచుతాను అంటోంది. అంటే AI కి కూడా అంతుచిక్కని రహస్యం అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉండగా..ఏపీ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ వేస్తూ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారని కాపు కాసుకొని ఉన్నారు. అయితే, బెట్టింగ్ రాయుళ్లు కూడా కొంత కాలంగా వైస్సార్సీపీ మీద బెట్టింగ్ కాస్తున్నారు. ఫలితాలకు సంబంధించి తాజా ట్రెండ్స్ కూటమి వైపు చూపుతున్నాయని తెలిసి..ఒక్కప్పుడు వైస్సార్సీపీ మీద బెట్టింగ్ కాసినవారు మళ్ళీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు..రాష్ట్రంలో కూటమి వస్తుంది అనుకున్న వారు..మళ్ళీ వైస్సార్సీపీ అధికారంలోకి వస్తది అని చెప్పి మొగ్గు చూపుతున్నారు. ఇలా సందర్భాన్ని బట్టి బెట్టింగ్ రాయుళ్లు ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల మీద గందరగోళం ఏర్పడుతోంది.
We’re now on WhatsApp : Click to Join
రాష్ట్రంలో అటు పార్టీ నాయకులూ కూడా ఎన్నికల ఫలితాల మీద నోరువిప్పని పరిస్థితి. కాగా, పైకి మాత్రం మేమే తిరిగి అధికారంలోకి వస్తాం అని చెప్తూ..ఏ పార్టీ కి ఆ పార్టీ నాయకులూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఖచ్చితంగా రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో వచ్చే మంగళవారం రోజున..జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎవరు అధికారం చేజిక్కిచ్చుకుంటారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. పోలింగ్ జరిగి దాదాపు 15 రోజులు అయిపోతుంది. అయినప్పటి కూడా ఎవరు అధికారంలోకి వస్తారనే దానిమీద సరైన ప్రిడిక్షన్స్ ,సరైన సర్వే సంస్థలు కూడా ఎన్నికల ఫలితాల మీద ఖచ్చితమైన రిపోర్ట్స్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతకుడా త్రీవ ఉత్కంఠగా జూన్ 4 న వెలువడే ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.