Vangaveeti Radha: జనసేనలోకి రాధా? లోకేష్ తో వంగవీటి భేటీ!
యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో లోకేష్, రాధా ఇద్దరు భేటీ రాజకీయ మలుపుకు బాట వేయనుంది. సమావేశం తరువాత నారా లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో రాధ
- By CS Rao Published Date - 10:20 AM, Tue - 7 March 23

యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో లోకేష్, రాధా ఇద్దరు భేటీ రాజకీయ మలుపుకు బాట వేయనుంది. సమావేశం తరువాత నారా లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో రాధ పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.లోకేశ్‌తో రాధ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లభిస్తోంది. రాజకీయ అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.గత కొంతకాలంగా పలువురు నేతలతో విస్తృత చర్చలు జరిపిన వంగవీటి రాధా (Vangaveeti Radha), వివిధ రాజకీయ అంశాలు, ఇతర నేతల చర్చల్లో వచ్చిన అంశాలపై లోకేశ్‌తో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జనసేనలో చేరికపై ఊహాగానాలు కూడా వస్తున్న తరుణంలో లోకేశ్, రాధా భేటీలో చర్చించే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వంగవీటి రాధా (Vangaveeti Radha) టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ యువనేత నారా లోకేష్ ను కలవబోతున్నారు. ఈ మేరకు లోకేష్ నుంచి రాధాకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీలేరులో పాదయాత్రలో ఉన్న లోకేష్ ను రాధా కలవాలని కోరినట్లు సమాచారం. దీంతో రాధా ఆయన్ను కలిసేందుకు బయలుదేరి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న విజయవాడ నేత వంగవీటి రాధా (Vangaveeti Radha). ఆయన రాజకీయ ప్రయాణం మీద కృష్ణ జిల్లాలోని కొన్ని చోట్లా ఆధారపడి ఉంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా.. ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈసారి మాత్రం టీడీపీని వీడి జనసేనలో చేరడం ద్వారా బందరు నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీకులు కూడా జనసేన నేతల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆయనతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 14న మచిలీపట్నం లో జరిగే ఆవిర్భావ సభ లో జనసేన తీర్థం రాధ తీసుకుంటారని తెలుస్తుంది. ఇదంతా టీడీపి, జనసేన మధ్య అవగాహనతో జరుగుతున్న మాటలబుగా ఇరు పార్టీల వర్గాల్లో ఉంది.
Also Read: Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!

Tags
- amaravati
- andhra pradesh
- ap
- chandra babu
- Janasena
- nara lokesh
- Pawan Kalyan
- politics
- tdp
- vangaveeti radha

Related News

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.