HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Qr Code On Hall Tickets For Class 10 Students Center Details Only After Scanning

AP SSC Hall Tickets : పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Ssc Hall Tickets
Ap Ssc Hall Tickets
AP SSC Hall Tickets  ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది.

గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, పరీక్షా కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ వంటి వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల విద్యార్థులు ఎలాంటి గందరగోళం లేకుండా సమయానికి కేంద్రానికి చేరుకోవచ్చు.

ఈ కొత్త హాల్‌టికెట్‌పై విద్యార్థి ఫొటో, రోల్ నంబర్‌తో పాటు లీప్ యాప్, ప్రభుత్వ రాజముద్ర కూడా ఉన్నాయి. పరీక్షల సమయ పట్టికను కూడా స్పష్టంగా పొందుపరిచారు. ఇప్పటికే విడుదలైన ఈ హాల్‌టికెట్లను పాఠశాలల యాజమాన్యాలు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందిస్తాయి. ఇదిలా ఉంటే.. విద్యార్థులకు మరో సౌకర్యం కూడా కల్పించారు. పరీక్షల సమయంలో హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap education
  • AP Free Bus Travel
  • AP SSC
  • AP SSC Exams
  • AP SSC Hall Tickets
  • AP Tenth Class Exams
  • exam centers
  • QR code
  • SSC Hall Tickets
  • Tenth class exams

Related News

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd