HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Protesting Farmers Attempt To Block Cm Jagans Convoy

CM Jagan: సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రైతులు.. పక్కకు నెట్టేసిన సెక్యూరిటీ సిబ్బంది

శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ (CM Jagan)కు చేదు అనుభవం ఎదురైంది. తుంపర్తి గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌ (CM Jagan’s Convoy)ను అడ్డుకున్నారు.

  • Author : Gopichand Date : 27-04-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan
Resizeimagesize (1280 X 720) (4)

శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ (CM Jagan)కు చేదు అనుభవం ఎదురైంది. తుంపర్తి గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌ (CM Jagan’s Convoy)ను అడ్డుకున్నారు. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం నార్పలలోని జగనన్న నివాసంలో జరిగిన ఆశీర్వాద కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్తున్న ప్రత్యేక హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకున్నారు.

పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు 210 ఎకరాలు సేకరించి నష్టపరిహారం ఇవ్వని ఏపీ ప్రభుత్వం

సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన తుంపర్తి, మోటుమర్రి రైతులు

రైతులను పక్కకు నెట్టి పక్కన విసిరేసిన ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది pic.twitter.com/DJv5LYajpx

— Telugu Scribe (@TeluguScribe) April 26, 2023

ఈ సమయంలో ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని పక్కకి నెట్టేశారు. దీంతో సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పరిహారం అందించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని వారు వాపోయారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని.. పోలీసులు తోసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad Students: అమెరికాలో ఇద్దరు హైదరాబాదీలు మృతి.. యూఎస్ లోనే అంత్యక్రియలు..!

బుధవారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో విద్యార్థుల ఖాతాలకు “జగనన్న విద్యా దీవెన” పథకం నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమయ్యాయి. జగనన్న వసతి గృహాల ఆశీర్వాదం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు అందజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur District
  • Andhrapradesh
  • cm jagan
  • CM Jagan Convoy
  • farmers protest

Related News

Ttd

ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

Sri Kalyana Venkateswara Swamy Temple : అనంతమైన ఈ విశ్వంలో అసలైన సౌందర్యం … నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వర స్వామిదే. ఆయన వెలసిన ప్రతి క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించేదిగా కనిపిస్తుంది … ఆ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే జీవితం సార్ధకమైనట్టుగా అనిపిస్తుంది. అలా ఆ కొండంత దేవుడు కొలువుదీరిన క్షేత్రం కృష్ణా జిల్లా ‘మంటాడ’లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి – భూదేవి సమేతంగా

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd