HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Ap Projects Visakhapatnam Tirupati Development

Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల ఆశ ఫలించేనా..

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.

  • Author : Kavya Krishna Date : 08-01-2025 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Narendra Modi, Vizag Steel Plant
Narendra Modi, Vizag Steel Plant

Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. విశాఖపట్నంలో జరిగే ఈ పర్యటనలో ప్రధానంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్: అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతోన్న ఈ హబ్‌ పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయనున్నారు. సముద్రపు నీటిని డీసాలినేషన్ ద్వారా శుద్ధి చేసి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

బల్క్‌ డ్రగ్‌ పార్క్: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీని ద్వారా 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అంచనా వేస్తున్నారు. 28 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

రైల్వే ప్రాజెక్టులు: చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్‌ రహదారి. నాగార్జునసాగర్‌-దావులపల్లి ద్విరేక రహదారి విస్తరణ. గుడివాడ-మచిలీపట్నం రైల్వే డబ్లింగ్‌ ప్రాజెక్టు. భీమవరం-నిడదవోలు రైల్వే డబ్లింగ్‌. గుత్తి-ధర్మవరం రైల్వే లైన్‌ డబ్లింగ్‌.

తిరుపతి క్రిస్‌సిటీ: తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌, ఆటో, ఫార్మా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే 37 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగనుంది.

ఇతర ప్రాజెక్టులు:

  • ఆదోని-బైపాస్‌ రోడ్డు విస్తరణ.
  • దోర్నాల-కుంట జంక్షన్‌ మార్గ విస్తరణ.
  • సంగమేశ్వరం-నల్లకాలువ రహదారి.

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఈ పర్యటనలో ప్రధానమంత్రి కీలక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. విశాఖ వేదికగా మోదీ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వగలరని పరిశీలకులు ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రకటితమయ్యే ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి పునాది వేస్తాయని భావిస్తున్నారు.

Shafali Verma: అండ‌ర్‌-19 ఆడ‌టం గొప్ప అవ‌కాశం: ష‌ఫాలీ వ‌ర్మ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Bulk Drug Park
  • employment opportunities
  • infrastructure development
  • Investments
  • NTPC Green Hydrogen Hub
  • pm modi
  • Railways
  • Tirupati
  • Visakhapatnam

Related News

Do you know what are the 5 holy shrines that you must visit in India?

భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

2026లో మీరు కూడా ఒక కొత్త ఆరంభాన్ని కోరుకుంటే, భారతదేశంలోని ఈ 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలను తప్పకుండా సందర్శించాల్సిందే.

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • PM Kisan Yojana

    పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

Latest News

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd