HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Speech In Ap Assembly

AP Assembly : వైసీపీ హయాంలో రూ.13వేల కోట్లు దారి మళ్లింపు..చర్యలు తప్పవు: పవన్‌ వార్నింగ్‌

. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.

  • Author : Latha Suma Date : 22-11-2024 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan speech in ap assembly
pawan kalyan speech in ap assembly

Pawan Kalyan : ఈరోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎన్‌ఆర్ఈజీ‌ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని తెలిపారు. నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజలు పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.

ఇక అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రూ. 5400 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం రూ.13వేల కోట్లు దారి మళ్లించిందని. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తప్పని సరిగా తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని పవన్‌ విమర్శించారు.

మరోవైపు అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ) , అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.

Read Also: 6-6-6 Walking : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 6-6-6 వాకింగ్ రొటీన్

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • ap assembly
  • Deputy CM Pawan Kalyan
  • Jana Sena
  • job cards
  • ys jagan
  • ysrcp

Related News

    Latest News

    • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

    • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd