HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Parliament Is Not Protected

Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?

డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు.

  • Author : Sudheer Date : 14-12-2023 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parliament Is Not Protected...
Parliament Is Not Protected...

By: డా. ప్రసాదమూర్తి

Andhra Pradesh Parliament is not protected? : డిసెంబర్ 13. ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున పార్లమెంటు భవనం పై ఉగ్రవాదుల దాడి జరిగింది. సరిగ్గా అదే రోజున డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు. దేశ రక్షణ గురించి, దేశ సరిహద్దుల గురించి, విదేశీ చొరబాటుదారుల దురాక్రమణాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి, దేశాన్ని రక్షించడానికి మేమున్నామంటూ 56 అంగుళాల ఛాతీ ప్రదర్శనలో అగ్రగామిగా నిల్చున్న మన నేతలు, జరిగిన ఈ ఘటన మీద ఏమని వ్యాఖ్యానిస్తారు? ఎలా సమర్థించుకుంటారు? పాత భవనం నుంచి కొత్త భవనంలోకి వెళ్లేటప్పుడు చేసిన హంగామా, జరిగిన తతంగం, దేశమే కాదు ప్రపంచమే చూసింది.

రాజ దండానికి ఎలాంటి పూజలు జరిగాయో, ఆ సందర్భంగా హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఎలాంటి షూటింగ్ జరిగిందో, ఇక రాజదండం ఉంది రాజు ఉన్నాడు మనకేం పరవాలేదు అన్న భరోసా ఇవ్వడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎన్ని ప్రయత్నాలు చేశారో మనకు తెలుసు. కానీ మనం సరిహద్దుల్లో ఎంత భద్రంగా ఉన్నామనే దానికంటే దేశాన్ని కాపాడే నాయకులు కొలువై ఉన్న పార్లమెంటు భవనమే భద్రత కరువై భయం భయంగా ఉందన్న సంగతి నిన్న పార్లమెంట్లో (Parliament) జరిగిన ఘటన కళ్ళకు కట్టిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అసలేం జరిగింది?

లోక్ సభలో అధికార పార్టీ, విపక్ష పార్టీల సభ్యులంతా పార్లమెంటు కార్యకలాపాలలో మునిగి ఉండగా ఒక యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి పార్లమెంటు సభ్యులు కూర్చునే చోటికి దూకాడు. దూకడమే కాదు ఒక టేబుల్ మీద నుంచి మరో టేబుల్ కి కోతిలా గెంతుతూ అధ్యక్ష పీఠం వైపు వెళ్ళాడు. ఇంతలో కొందరు పార్లమెంట్ సభ్యులు అతన్ని పట్టుకొని సమూహంగా అతన్ని చితక బాదారు. అంతలోనే అతను వేసుకున్న బూట్లు నుంచి పసుపు రంగులో ఉన్న పొగలాంటి గ్యాస్ రిలీజ్ చేశాడు. ఇది జరుగుతూ ఉండగానే మరో యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి అతను కూడా ఇదే సీన్ రిపీట్ చేశాడు. సరే అతన్ని కూడా పట్టుకున్నారు. వాళ్ళిద్దర్నీ పట్టుకున్న వాళ్ళు ఒకరు కాంగ్రెస్ ఎంపీ, మరొకరు ఆర్ఎల్పీ ఎంపీ అని తెలుస్తుంది. అందరూ కలిసి వాళ్ళకి దేహశుద్ధి చేయడంలో మాత్రం పార్టీ విభేదాలు చూపించలేదు.

ఎవరీ యువకులు?

లోపల ఈ ఘటన జరుగుతుండగా పార్లమెంటు బయట ఒక యువతి గట్టిగా నినాదాలు చేస్తూ పట్టుబడింది. ఆమెకు వెనక కొందరు యువకులు ఉన్నట్టు మీడియా రిపోర్టు. ఆమె నిరుద్యోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు, రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు, తానాషాహి నహీ చెలేగీ అంటూ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఆమెను బయట పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అసలు వీరంతా ఎవరు? పార్లమెంటు ప్రాంగణంలోకి, సరాసరి పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారు అనేవి అసలు ప్రశ్నలు. పార్లమెంట్లో ఇంత హంగామా సృష్టించి పసుపు పచ్చని పొగ వ్యాపింపజేసి మొత్తం దేశాన్ని కలవరపరిచిన ఆ యువకుడు సాగర్ శర్మ అని తెలిసింది. అతనిది మైసూర్. పార్లమెంట్లో ప్రవేశించడానికి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవడానికి అనుమతి అవసరం. మరి వీరికి అనుమతి ఎవరు ఇచ్చారు అంటే బిజెపికి చెందిన ప్రతాప్ సిన్హా అనే ఎంపీ వీరికి పాసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వారికి సాక్షాత్తు అధికారంలో ఉన్న పార్టీ ఎంపీనే ఎలా పాస్ లు జారీ చేశాడు? అసలు విషయం బయట పడాల్సి ఉంది.

దీనికంటే భద్రతలో చాలా అత్యద్భుత అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ముందున్నామని అలనాడు కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కరణ సందర్భంలో మీడియా వాయించి కొట్టింది. మరి ఇంత జరుగుతున్నా అసలు భద్రతా బలగాలు ఏమయ్యాయి? పార్లమెంటులోకి ఆ దుండగులు ఎలా ప్రవేశించగలిగారు? వారు తాము వేసుకున్న బూట్లలో ఆ గ్యాస్ ఎలా దాచుకోగలిగారు? దీన్ని మన భద్రతా బలగాలు ఎలా కనిపెట్టలేకపోయాయి? ఒకవేళ ఆ గ్యాస్ ఏ విషపూరితమైనదైనా అయితే మన నాయకులు ఏమయ్యే వారు? మన పార్లమెంటు భవనం ఏమయ్యేది? మన పార్లమెంటు ప్రజాస్వామ్యం ఏమయ్యేది? ప్రపంచం ముందు మన దేశం ఎలా తలెత్తుకొని నిలబడేది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినది బాధ్యులైనటువంటి పాలక మహాశయులే.

ఈ ఆగంతకులకు ఎంట్రీ పాసులు ఇచ్చింది అధికార పార్టీ ఎంపీ కాబట్టి సరిపోయింది అదే ఏ ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఇచ్చినా ఈపాటికి ఏం జరిగేదో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా, 56 అంగుళాల రక్షా కవచాన్ని ఈ తాజా ఉదంతం తూట్లు తూట్లు పొడిచింది. దీన్ని ఏ రకంగా మరమ్మత్తు చేసుకుంటారో చూడాలి. ‌

Also Read: Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • parliament
  • protection

Related News

Centre Of Excellence For Ai

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్‌ కి ఏడు ఒప్పందాలు

Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ‘ఇ

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

  • Bill Gates to visit Amaravati Today

    చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd