Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు
- By Sudheer Published Date - 10:29 AM, Thu - 14 December 23

ప్రజా భవన్ (Prajabhavan) ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కు కేటాయిస్తున్నట్లు నిన్న బుధువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అధికారిక నివాసంలో అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలతో గృహప్రవేశం చేసిన భట్టి.. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి, అనంతరం ఆయన తన ఆఫీస్‌లో బాధ్యతల స్వీకరించారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం ఉదయం 8:21 గంటలకు తన ఛాంబర్‌లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇందన, ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను భట్టి విక్రమార్క స్వీకరించారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు.
విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై , అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు రూ.75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎంకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్ కోస్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరితలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : Case Under UAPA: పార్లమెంట్ హౌస్ భద్రత లోపం.. UAPA సెక్షన్ కింద కేసు నమోదు..? UAPA చట్టం అంటే ఏమిటి?