HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Palle Panduga Varotsavalu Starts Tomorrow In Ap

Palle Panduga : ఏపీలో రేపటి నుండి పల్లె పండుగ వారోత్సవాలు

Palle Panduga : ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

  • Author : Latha Suma Date : 13-10-2024 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
palle panduga varotsavalu starts tomorrow in ap
palle panduga varotsavalu starts tomorrow in ap

Deputy CM Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా కంకిపాడులోని ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అక్టోబ‌ర్ 14 నుంచి 20 వ‌ర‌కు 7 రోజుల పాటు జ‌రిగే వారోత్స‌వాల కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

Read Also: Madhusudana Chari : మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ధుసూద‌న‌చారి బాధ్యతలు

గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా.. గ్రామ ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారోత్సవాలు బలమైన గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనకు పునాది వేస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ, నీటి, రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామాల్లో ఆర్థిక చలనం వలస కలిగే ప్రయోజనాలను విస్తృత ప్రచారం చేసినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా, గ్రామాల్లో నివాసం ఉంటున్న కుంటుంబాల‌కు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామ‌ని పవన్ వ్యాఖ్యానించారు. ఈ 100 రోజుల్లో ఉపాధి హామీ కూలీల‌కు 466.13 ల‌క్ష‌ల ప‌నిదినాల‌ను క‌ల్పించామని చెప్పారు. 1.07 ల‌క్ష‌ల కుటుంబాల‌కు 100 రోజుల ప‌ని దినాలని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ చేస్తున్నామన్న పవన్.. ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు, సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యమ‌ని స్పష్టం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల్గొంటారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కేటాయించిన ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌ల్లె పండ‌గ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలను నిర్వ‌హించ‌డంతో ఎంపీడీఓలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హ‌ణ చేస్తున్నారు.

Read Also: Mahela Jayawardene: ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా జ‌య‌వర్ధ‌నే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • Deputy CM Pawan Kalyan
  • Kankipadu
  • krishna district
  • Palle Panduga program

Related News

Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శ

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd