Andhra Pradesh
-
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Date : 06-09-2025 - 12:26 IST -
Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1
Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు
Date : 06-09-2025 - 9:30 IST -
Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది
Date : 06-09-2025 - 9:15 IST -
YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు
ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.
Date : 05-09-2025 - 8:29 IST -
AP Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
AP Liquor Scam : ఇప్పుడు మాజీ సీఎం సోదరుడి పీఏ విచారణకు పిలవడంతో ఈ కేసు పరిధి మరింత విస్తరిస్తోంది. దేవరాజులు ద్వారా మరికొంతమంది కీలక వ్యక్తుల పాత్ర బయటపడవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు
Date : 05-09-2025 - 7:13 IST -
Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.
Date : 05-09-2025 - 5:42 IST -
AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.
Date : 05-09-2025 - 5:10 IST -
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 05-09-2025 - 2:55 IST -
Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!
కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.
Date : 05-09-2025 - 1:30 IST -
Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు
న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
Date : 05-09-2025 - 12:29 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Date : 05-09-2025 - 12:15 IST -
Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్
సోషల్ మీడియాలో ఫేక్ హ్యాండిల్స్‌ను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా టీచర్లపై అపవాదులు మోపడం దారుణమని, ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఓ ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.
Date : 05-09-2025 - 11:28 IST -
CBN New Helicopter – సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్..ప్రత్యేకతలు ఇవే..!
CBN New Helicopter : దీనిలో ఉన్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన భద్రతా ఫీచర్లు, తక్కువ శబ్దం చేయడం దీని ముఖ్య లక్షణాలు. ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది
Date : 05-09-2025 - 10:38 IST -
AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!
గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.
Date : 05-09-2025 - 10:27 IST -
Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!
Universal Health Policy : ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు హెల్త్ పాలసీ అందించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ కింద ఎంపిక చేసిన కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది
Date : 05-09-2025 - 8:15 IST -
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Date : 04-09-2025 - 8:21 IST -
Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ లక్ష్యం, వైద్య ఖర్చుల వల్ల ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూడటమే. ఈ కొత్త విధానం పాత ఆరోగ్య పథకాలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది.
Date : 04-09-2025 - 7:14 IST -
AP Cabinet : యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించే దిశగా ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని ఆయుష్మాన్ భారత్–ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఆధారంగా రూపొందించారు. తాజా నిర్ణయం ప్రకారం, ప్రతి కుటుంబానికి ఏడాదికి ₹25 లక్షల వరకు ఉచిత వైద్యచికిత్సలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
Date : 04-09-2025 - 2:40 IST -
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Date : 04-09-2025 - 1:53 IST -
CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!
ఈ రోజు కేబినెట్‌లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Date : 04-09-2025 - 11:35 IST