CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!
ఈ రోజు కేబినెట్‌లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- By Latha Suma Published Date - 11:35 AM, Thu - 4 September 25

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా, పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా ముందుకు సాగనుంది. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రూ.53,922 కోట్ల పెట్టుబడులకు అంగీకారం?
ఈ రోజు కేబినెట్‌లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫుడ్ ప్రాసెసింగ్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME), ఎనర్జీ వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు రావనున్నాయి.
పారిశ్రామిక పార్కులు, ఎకో సిస్టంలు, బిజినెస్ హబ్‌ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, వాటికి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
సీఆర్డీఏ, భూ కేటాయింపులపై చర్చ
ఈ రోజు సమావేశంలో కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) నుండి వచ్చిన వివిధ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. ఇందులో అర్బన్ డిజైన్, ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ నోటిఫికేషన్, కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపు, ప్రత్యేక ప్రయోజన వాహన సంస్థల (SPVs) ప్రాజెక్టులకు అనుమతులివ్వడం వంటి అంశాలు ఉన్నాయి. అంతేగాక, ల్యాండ్ పూలింగ్‌కు లోబడని భూములను భూ సేకరణ ద్వారా ప్రభుత్వ అవసరాలకు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలనే దిశగా కూడా కేబినెట్ ఆలోచనలో ఉంది.
అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి?
ఈ రోజు సమావేశంలో మరో కీలక అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చించనుంది. తుది నిర్ణయం ఈ కేబినెట్‌లో తీసుకునే అవకాశముంది.
SIPB తీర్మానాలకు అధికారిక ఆమోదం?
ఇటీవలి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశాల్లో తీసుకున్న కొన్ని ముఖ్యమైన పెట్టుబడుల తీర్మానాలను ఈ రోజు కేబినెట్‌లో అధికారికంగా ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఇవి ప్రభుత్వ దృష్టిలో ప్రాధాన్యత కలిగిన ప్