Andhra Pradesh
-
TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట
Date : 31-05-2026 - 8:15 IST -
TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి
2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ, పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి పేర్కొన్నారు. యువనేత నారా లోకేష్ చేసిన ఈ ప్రకటన మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాట్లాడటమే కాకుండా..
Date : 30-05-2026 - 6:38 IST -
AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు
Date : 29-05-2026 - 10:52 IST -
Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభక్తులు.. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం
Date : 29-05-2026 - 8:39 IST -
Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ
Date : 29-05-2026 - 6:25 IST -
TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి
రాష్ట్రంలో యువత భవిష్యత్తుతో ఆటలాడిన చరిత్ర వైఎస్సార్‌సీపీ, జగన్ కుటుంబానిదేనని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల
Date : 29-05-2026 - 4:31 IST -
Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి
విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ డ్రైవర్‌గా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జానీ కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు తీసుకున్న జానీ తన సొంత ఆటోలో భార్యతో కలిసి బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే ఈదురు గ
Date : 29-05-2026 - 1:08 IST -
APL : జూన్ 9 నుంచి ఏపీఎల్ 2026.. విశాఖ వేదికగా ప్రారంభం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2026 జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు ప్రతిభ చాటుకునే వేదికగా నిలిచే ఈ టోర్నీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఏపీఎల్-2026 అధికారిక షెడ్యూల్‌ను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క
Date : 29-05-2026 - 8:37 IST -
Mahanadu : ముగిసిన మహానాడు.. వర్చువల్‌గా 24 లక్షల మంది హాజరు
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార
Date : 28-05-2026 - 10:22 IST -
Coca Cola : శ్రీకాళహస్తి పల్లెల్లో ఈవీ చెత్త వాహనాలు, ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సామాజిక రంగాల్లో ముందంజలో ఉన్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా
Date : 28-05-2026 - 8:11 IST -
Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు-2026 నివాళ్లు అర్పించింది. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని టీడీపీ మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడు రెండో రోజు సభలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రసంగించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్
Date : 28-05-2026 - 2:45 IST -
BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
ఆంధ్రప్రదేశ్‌లో నానో మరియు సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేయడమే కాకుండా, యువతను ఉద్యోగాన్వేషుల నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు ఒక భారీ అడుగు పడింది. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ కళా వేదికలో ఘనంగా జరిగిన ‘ఒక కుటుంబం-ఒక వ్యవస్థాపకుడు
Date : 27-05-2026 - 9:28 IST -
Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణి
మహిళలను కేవలం ఓటు బ్యాంక్‌గా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. టీడీపీ మహానాడు–2026 కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళల ఉన్నత విద్య కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డల విద్యకు కొత్త దా
Date : 27-05-2026 - 3:58 IST -
AP : చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు.. కలెక్టర్ హెచ్చరిక
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (PC-PNDT) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లు, ఐవీఎఫ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీ-పీఎన్‌డీటీ
Date : 27-05-2026 - 12:14 IST -
TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మహానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ పార్టీ నివేదికను సమర్పించారు. గత ఐదేళ్లలో ఎదురైన రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. టీడీపీ పోరాట పటిమను కొనియాడారు. “ఐదేళ్లు గొడ్డలి పార్టీని టీడీపీ ధైర్యంగా ఎదుర్కొందని.. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చే
Date : 27-05-2026 - 12:03 IST -
Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పె
Date : 27-05-2026 - 11:55 IST -
YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో
Date : 26-05-2026 - 2:32 IST -
Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?
రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన
Date : 26-05-2026 - 1:21 IST -
ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క
Date : 26-05-2026 - 9:07 IST -
Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు
ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. AP 39 TK 3741 నంబర్ గల సితార ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూలిం
Date : 26-05-2026 - 8:39 IST