AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
- By Kavya Krishna Published Date - 10:06 AM, Fri - 29 August 25

AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘన నివాళులు అర్పించారు. హరికృష్ణతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. “నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మద్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు… అంతకంటే ఎక్కువ ఆత్మీయత, స్నేహం మేమిద్దరం పంచుకున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులందరికీ కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి” అని తెలిపారు. హరికృష్ణ తన రాజకీయ జీవితంలో పార్టీ బలోపేతానికి కీలకంగా పనిచేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
Vishnupriya : నడుము ఒంపులతో కాకరేపుతున్న విష్ణుప్రియ
హరికృష్ణను “హరి మామయ్య” అని పిలుస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు. “హరి మామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలు అందించారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరి మామయ్య లేని లోటు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం” అని అన్నారు.
నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన హరికృష్ణ, ‘శ్రీ కృష్ణావతారం, తత్కాలిక చిత్రాలు వంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీకి బలమైన మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా పొలిట్ బ్యూరో సభ్యునిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా మారాయి. హరికృష్ణ మరణం టీడీపీకి, నందమూరి కుటుంబానికి, అభిమానులకు తీరని లోటు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
Controversy : స్టేజ్ పై నటి నడుమును తాకి వివాదంలో చిక్కిన పవన్