Controversy : స్టేజ్ పై నటి నడుమును తాకి వివాదంలో చిక్కిన పవన్
Controversy : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక వేదికపై ఆయన ఒక నటితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
- Author : Sudheer
Date : 28-08-2025 - 8:35 IST
Published By : Hashtagu Telugu Desk
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా పేరుపొందిన పవన్ సింగ్ (Pawan Singh ) ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక వేదికపై ఆయన ఒక నటితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ సింగ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేదికపైనే ఒక మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సంఘటన యూపీ లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో చోటుచేసుకుంది. నటి అంజలి మైక్‌లో మాట్లాడుతుండగా, పవన్ సింగ్ ఆమె నడుమును తాకారు. అంజలి వెంటనే అసౌకర్యంగా ఫీలైనప్పటికీ, పవన్ సింగ్ మళ్లీ అదే పని చేయడంతో ఆమె మరింత ఇబ్బంది పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన వేదికపైనే జరగడం, వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఒక నటి పట్ల ఇలా ప్రవర్తించడం పవన్ సింగ్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఆయన వెంటనే నటి అంజలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
India Shock to Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న భారత్
ఈ వివాదంపై పవన్ సింగ్ ఇంకా స్పందించలేదు. ఒక ప్రజా వేదికపై ఇలాంటి ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించలేమని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. కళాకారులు తమ అభిమానులకు ఆదర్శంగా ఉండాలని, కానీ ఇలాంటి సంఘటనలు వారి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన భోజ్‌పురి సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై పవన్ సింగ్ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.