Vishnupriya : నడుము ఒంపులతో కాకరేపుతున్న విష్ణుప్రియ
Vishnupriya : తక్కువ సమయంలోనే యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ..ముఖ్యంగా పోవే పోరా షోతో మంచి క్రేజ్ సంపాదించింది
- By Sudheer Published Date - 07:11 PM, Thu - 28 August 25

టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya ) ఒకరు. తక్కువ సమయంలోనే యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ..ముఖ్యంగా పోవే పోరా షోతో మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో నటించి తన ప్రతిభను చూపించింది. ధైర్యంగా, బోల్డ్‌గా మాట్లాడే విష్ణుప్రియ, తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బిగ్‌బాస్‌లో కూడా విష్ణుప్రియ పాల్గొని మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. విన్నర్ అవుతుందని అభిమానులు భావించినా, ఆట కన్నా వ్యక్తిగత సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విమర్శలు ఎదుర్కొంది. దీంతో మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయినప్పటికీ బిగ్‌బాస్ వేదిక ద్వారా పెద్ద ఎత్తున గుర్తింపు సంపాదించింది. షో తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో అనుసంధానమై ఉంటుంది.
Urea Shortage Telangana : యూరియా ఇవ్వండి అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు
తాజాగా విష్ణుప్రియ తన ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. గ్లామర్ ఫోటోలతో బోల్డ్‌గా ఇచ్చిన పోజులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె అందాలు చూసిన అభిమానులు సినిమాల్లో కూడా అవకాశాలు రావాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ రకమైన ఫొటోషూట్‌లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా విష్ణుప్రియ తన స్టైల్‌తో, ధైర్యవంతమైన ఇమేజ్‌తో ఎప్పుడూ చర్చలో నిలుస్తూనే ఉంది.