Kethireddy Venkatarami Reddy: విజయసాయి రెడ్డి పోవడం వలన నష్టమేమీ లేదు: కేతిరెడ్డి
. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్‌గా కూడా ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డిపై అక్కడి స్థానిక నేతల్లో వ్యతిరేకత ఏర్పడిందని కేతిరెడ్డి తెలిపారు.
- Author : Gopichand
Date : 26-01-2025 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
Kethireddy Venkatarami Reddy: ఏపీలో గత రెండు రోజులుగా విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. జగన్‌కు విధేయుడు, అత్యంత నమ్మకస్థుడైన విజయసాయి రెడి సడెన్‌గా రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంపై వైసీపీ రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కు వెన్నంటే ఉన్న విజయసాయి రెడ్డి ఇలా రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పటం ఒకింత అన్ని రాజకీయ పార్టీలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అయితే విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై వైసీపీ నాయకులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి రాజీనామా అంశంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో నమ్మకంగా జగన్‌కు అండగా ఉన్నారు. రాజ్యసభ సీటు ఇవ్వడం, ఢిల్లీలో జగన్ వ్యవహారాలు విజయసాయి రెడ్డి చూసేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్‌గా కూడా ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్ బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డిపై అక్కడి స్థానిక నేతల్లో వ్యతిరేకత ఏర్పడిందని కేతిరెడ్డి తెలిపారు.
Also Read: ‘Bharat Parv’ Celebrations: రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ గురించి మీకు తెలుసా?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర విషయంపై విజయసాయి రెడ్డి ఏం మాట్లాడలేదు కాబట్టి మనం ఏం మాట్లాడాలేం. కానీ ఈడీ, సీబీఐ వ్యవస్థలే రాజకీయ నాయకులను బెండ్ చేస్తున్నాయి. దీనికి విజయసాయి రెడ్డి అతీతుడు కాదు అని నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ తెలుసు. లేకుంటే ఆయన చేయలేని, ఇప్పుడు చెప్పలేని రాజకీయం ఏముంది? అని కేతిరెడ్డి అన్నారు. సాయి రెడ్డి పోవడం వల్ల పెద్దగా వైసీపీకి వచ్చే నష్టం ఏమి లేదని స్పష్టం చేశారు. జగన్ సొంత చెల్లే అన్న నాశన్నాన్ని కోరుకుంటుంది. ఇలా అందర్నీ ఎదుర్కొని జగన్ ముందుకు వస్తున్నారని అని కేతిరెడ్డి పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి వ్యవహారంపై కేతిరెడ్డి స్పందించిన తీరు చూస్తుంటే పలు ప్రశ్నలకు తావిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. విజయసాయి రెడ్డికి పార్టీలో సరైన గుర్తింపు లేకనే రాజకీయాలకు రామ్ రామ్ చెప్పారని, జగన్‌తో ఇదే విషయమై మాట్లాడినా అతను లైట్ తీసుకోవడంతో విజయసాయి రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే కేతిరెడ్డి స్పందించిన తీరు చూస్తుంటే నిజంగా విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేదా? అనే కొత్త ప్రశ్న వస్తోంది.