HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Sketch For The Comprehensive Development Of Ap Chandrababus Master Plan

Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 29-11-2025 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn
Cbn

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు వేగంగా పరిష్కారం కావాలంటే వారంతా ఒక జాయింట్ కమిటీగా ఏర్పడితే బాగుంటుందని సూచించారు. అప్పుడు వారితో చర్చించి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం రోజున మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని.. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే రాజధాని రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్‌ కిందకు రావాలని చంద్రబాబు సూచించారు. వారందరూ కలిసి జేఏసీగా ఏర్పడితే సమస్యల పరిష్కారం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పూర్వోదయ పథకం కింద రాయలసీమ ప్రాంతానికి రూ.40 వేలకోట్లతో ఓ సమగ్ర ప్రణాళిక అమలుచేసేందుకు కసరత్తు జరుపుతోంది. క్లస్టర్ల ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇతర దేశాల్లోనూ డిమాండ్ ఉన్న అరటి, మామిడి, దానిమ్మ, బొప్పాయి వంటి పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. రాయలసీమ రైతులకు డ్రిప్ రాయితీలు అందించటంతో పాటుగా వారి పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల కోసం ఎయిర్ కార్గో ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. అలాగే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్ల వంటివి ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాంతానికి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటుగా చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, ఆ చుట్టు పక్కల జిల్లాలలో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, లులూ, యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ సంస్థలు అక్కడ పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇక కోస్తా ప్రాంతం విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో వ్యవసాయంతో పాటుగా పర్యాటకం, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తీర ప్రాంతం వెంబడి బీచ్‌లను అభివృద్ధి చేసి.. పర్యాటకులకు ఆకర్షించాలని భావిస్తున్నారు. అలాగే పోర్టులను అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • Special Zones

Related News

Cbn Jagan

AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

హైదరాబాద్‌తో పోటీపడి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా అమరావతిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Rajahmundry Kakinada Trains

    Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

  • Loan App Harassment Kakinada

    Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

Latest News

  • IPL 2026 : ఫస్ట్ మ్యాచ్ లో RCB చేతిలో SRH చిత్తు

  • CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

  • IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd