HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New National Highway In Ap At A Cost Of Rs 800 Crores

Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 1:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Palamaner Krishnagiri Natio
Palamaner Krishnagiri Natio

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం చేస్తున్నారు. కొన్ని హైవేల పనులు ముగింపు దశకు రాగా.. మరికొన్ని ఒకటి, రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రాంలో మరికొన్ని కొత్త రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు చేస్తోంది. ఈ మేరుకు కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపుతోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మరో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

చిత్తూరు జిల్లా కృష్ణగిరి-పలమనేరు రోడ్డును విస్తరించున్నారు. ఈ మేరకు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. జాతీయ రహదారుల శాఖ ఈ అభివృద్ధి పనులను చేపట్టనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డు.. పలమనేరు నుంచి బైరెడ్డిపల్లె, వి.కోట మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి వరకు నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ విస్తరణతో ప్రయాణం వేగవంతం అవుతుంది. వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల శాఖ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

ఈ హైవే ప్రతిపాదన ప్రస్తుతం డీపీఆర్‌ దశలో ఉందని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. ఈ టెండర్ల పక్రియ పూర్తయ్యాక భూసేకరణ మొదలు పెడతారు. ఇప్పటికే ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ హైవే పనులు కూడా పూర్తి చేస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వైపు, కర్ణాటక వైపు త్వరగా వెళ్లొచ్చు. రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. అధికారులు ఇప్పటికే పలమనేరు నుంచి కుప్పం వరకు భూసేకరణ సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ రోడ్డులో దారి పొడవునా కల్వర్టులు, వంతెనలు ఎన్ని అవసరమో తర్వాత నిర్ణయిస్తారు.

ఈ కల్వర్టలు, బ్రిడ్జిలు నెల రోజుల్లో ప్రక్రియ మొదలవుతుందని ఎన్‌హెచ్‌ అధికారులు తెలిపారు. కృష్ణగిరి-పలమనేరు వరకు 82 కి.మీ రోడ్డును విస్తరించనున్నారు.. అంచనా వ్యయం రూ.800 కోట్లని చెబుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో హైవేలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం పరిధిలో కొన్ని రోడ్లను విస్తరిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అటు తమిళనాడు, ఇటు కర్ణాటకకు కనెక్టివిటీ ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పనుల్ని వేగవతం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Krishnagiri
  • National highway
  • palamaner
  • Tirupati

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd