HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Navaratnalu Housing Scheme Beneficiary Review

AP News : ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..

AP News : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై పునర్విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచనలు అందాయి.

  • Author : Kavya Krishna Date : 12-02-2025 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Government guidelines on allotment of house plot
AP Government guidelines on allotment of house plot

AP News : కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ, విచారణ తప్పదని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద మంజూరైన ఇళ్ల స్థలాలు, పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల వివరాలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అర్హులు, అనర్హుల జాబితాను స్పష్టంగా వేరు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పునర్విచారణపై స్పష్టమైన ఆదేశాలు
ఈ నేపథ్యంలో, పథకం కింద ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులపై పునర్విచారణ జరిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వారిని గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు అందించాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా డేటాను సరిగ్గా నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. రెవెన్యూ అధికారులు గుర్తించిన అనర్హుల సమాచారాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాధికారులు చేపట్టారు.

New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఆ నలుగురికి బెర్త్.. ఎమ్మెల్యేల టఫ్ ఫైట్

ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
పునర్విచారణ ప్రక్రియను మండల స్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, వీఆర్వో సభ్యులుగా ఉండే బృందాలు ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులను పరిశీలిస్తాయి. ఈ సమీక్ష ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా 26 జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ జయలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

పరిశీలన వెనుక అసలైన ఉద్దేశం
ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలను బహిర్గతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూటమి నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వం తమ అనుకూలమైన వ్యక్తులకు అక్రమంగా ఇళ్ల పట్టాలను కేటాయించిందనే ఆరోపణలతో ఈ సమీక్ష చేపట్టారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఈ పునర్విచారణ ద్వారా నిజాలు బయటపడతాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

YCP : వైసీపీకి కాస్త ఊపిరి పోసిన కీలక నేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh news
  • AP Housing Scheme
  • Housing Beneficiary Review
  • Navaratnalu
  • revenue department
  • tdp
  • ysrcp

Related News

AP TDP

AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నాయకత్వం కోర్టుల్లో వందలాది కేసులు వేసిందని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd