HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh As Tdp Working President

Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం ఇస్తూ, సామాజిక కోణంలో కమిటీలను కూర్పు చేసినట్లు ఆయన తెలిపారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు అన్ని సమీకరణలను బేరీజు వేసుకుని ఈ కసరత్తు చేశారని పల్లా పేర్కొన్నారు. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి విధేయులుగా ఉంటూ, కష్టపడి పనిచేసిన వారికి ఈ నియామకాల్లో పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. గతానికి భిన్నంగా, క్షేత్రస్థాయి కార్యకర్తలకు సైతం అత్యున్నత పదవులు కట్టబెడుతూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జి గుత్తికొండ ధనుంజయ్‌కు నేరుగా పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.

ఈ కమిటీల కూర్పులో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 185 మంది సభ్యులున్న రాష్ట్ర కమిటీలో 122 మంది బడుగు, బలహీన వర్గాల వారేనని పల్లా తెలిపారు. ఇందులో బీసీలకు 77 (40%), ఎస్సీలకు 25 (25%), ఎస్టీలకు 7 (3.8%), మైనార్టీలకు 13 (7%) చొప్పున స్థానాలు కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా… పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి భవిష్యత్ పరిణామాలను అంచనా వేస్తూ ఈ కమిటీలను రూపొందించారని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నియామకాల ద్వారా నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారికి న్యాయం చేశామని, పార్టీ బలోపేతానికి ఈ మార్పులు దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Telugu Desam Party (@jai_tdp)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • AP CM Chandrababu Naidu
  • ap tdp
  • Education Minister Nara Lokesh
  • Minister Nara lokesh
  • Palla Srinivasa Rao
  • TDP (Telugu Desam Party)
  • telugu desam party

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • AP EAPCET 2026 results postponed again.

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd