HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Active In Ap Politics

AP Politics : ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై లోకేష్ మార్క్‌

ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవ‌ల దాకా జ‌న‌సేన‌, టీడీపీ క‌లుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఈ పొత్తుల‌పై నోరెత్త‌లేదు. పైగా ఆ పార్టీ నాయ‌కుల‌కు కూడా పొత్తుల గురించి ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తీసుకురావ‌ద్దంటూ హుకుం జారీ చేశార‌ట‌.

  • Author : CS Rao Date : 01-09-2022 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Law
Lokesh Mahanadu

ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి మీడియాలో రాస్తున్నారు. ఇటీవ‌ల దాకా జ‌న‌సేన‌, టీడీపీ క‌లుస్తున్నాయని హోరెత్తించారు. కానీ, ఏనాడూ టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ఈ పొత్తుల‌పై నోరెత్త‌లేదు. పైగా ఆ పార్టీ నాయ‌కుల‌కు కూడా పొత్తుల గురించి ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తీసుకురావ‌ద్దంటూ హుకుం జారీ చేశార‌ట‌. ఎన్డీయేలో భాగ‌స్వామ్యం ఖాయ‌మంటూ వ‌స్తోన్న న్యూస్ ను ఖండించ‌డంలేదు. అంతేకాదు, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాను టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ క‌లిశార‌ని హోరెత్తిస్తున్నారు. వాళ్లిద్ద‌రూ క‌లిసిన విష‌యాన్ని అటు టీడీపీ ఇటు బీజేపీ ధ్రువీక‌రించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

Also Read: AP Village Secretariats: నిర్లక్ష్యపు నీడలో ఏపీ గ్రామ సచివాలయాలు!

 

ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ 2018లో తెగ‌దెంపులు చేసుకుంది. ఆనాటి నుంచి మోడీ మీద వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు నిప్పులు గ‌క్కుతూ వ‌చ్చారు. 2019 ఎన్నిక‌ల త‌రువాత జాతీయ రాజ‌కీయ తెర‌మీద నుంచి పూర్తిగా ఆయ‌న త‌ప్పుకున్నారు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ కేంద్రంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ వేడుకల సంద‌ర్భంగా కేవ‌లం ఐదు నిమిషాల పాటు చంద్ర‌బాబును పలుక‌రించారు. ఆ ఐదు నిమిషాల మీట్ ను మీడియా భూత‌ద్దంలో చూస్తూనే ఉంది. అంత‌కంటే ముందు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీకి టీడీపీ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డాన్ని లింకు చేస్తూ ఇక బీజేపీ, టీడీపీ క‌లిసిపోయిన‌ట్టే ఒక విభాగం మీడియా డిసైడ్ అయింది.

 

Also Read: KCR Follows Chandrababu: బాబు బాటలో సీఎం కేసీఆర్

 

తొలుత వ్యూహాత్మంగా చంద్ర‌బాబు కుప్పం స‌భ‌లో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు గురించి `ఒన్ సైడ్ ల‌వ్ ` అంటూ వ్యాఖ్యానించారు. దానికి ఆజ్యం పోస్తూ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యానికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ వెళ్లారు. ఇంకేముంది జ‌న‌సేన లేకుండా టీడీపీ ఓడిపోతుంద‌ని ప్ర‌చారం మొద‌లుపెట్టారు. వాపును చూసి బలుపు అనుకున్న జ‌న‌సేన `ప‌వ‌ర్` షేరింగ్ వ‌ర‌కు వెళ్లింది. అప్ర‌మ‌త్తమైన చంద్ర‌బాబు న‌ష్ట నివార‌ణ‌కు దిగారు. అనివార్యంగా పొత్తు కోసం జ‌న‌సేన వెంట‌ప‌డేలా రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మార్చేశారు.

ఏపీ వేదిక‌గా బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉన్న‌ప్ప‌టికీ ఎక్కడా క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌డంలేదు. తిరుప‌తి లోక్ స‌భ , బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల త‌రువాత జ‌న‌సేన పార్టీని బీజేపీ లైట్‌గా తీసుకుంది. ప‌వ‌న్ కు ఉన్న సినిమా క్రేజ్ రాజ‌కీయాల్లో లేద‌ని గ్ర‌హించిన‌ట్టు ఉంది. అందుకే, చంద్ర‌బాబును మ‌రోసారి బీజేపీ న‌మ్ముకుంటోంది. ఆయ‌న చ‌తుర‌త‌ను జాతీయ స్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది. అందుకే, ఇటీవ‌ల బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు కూడా చంద్ర‌బాబు విజ‌న్ గురించి ప్ర‌శంసించ‌డం మొద‌లుపెట్టారు. ఇలాంటి ప‌రిణామాల‌ను చూస్తుంటే, జ‌న‌సేన పార్టీని వ‌దిలించుకుని టీడీపీతో మాత్ర‌మే బీజేపీ అంట‌కాగేలా ఉంది. అప్పుడు ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోయే అవ‌కాశాలు లేక‌పోలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • janasena pawan kalyan
  • nara lokesh
  • telugu desam party
  • YS Jagan Mohan Reddy

Related News

Kamma Corporation Chairman Brahmam Chowdary suffers a brain stroke.

Nadendla Brahmam Chowdary: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కి బ్రెయిన్ స్ట్రోక్

ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ను తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి బ్రహ్మం చౌదరి తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ను మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వెంటనే పరీక్షలు నిర్వహించారు. మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో (మేజర్ బ్లడ్ వెస్సెల్) రక్తం గడ్డకట

  • YS Jagan carried Mudragada Padmanabham Reddy's funeral bier.

    Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం రెడ్డి పాడె మోసిన Ys జగన్

  • Controversy at Mudragada Padmanabham's funeral... YCP objects to official honors.

    Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

  • Local elections in AP: Alliance aims for victory.

    AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

  • MLA Yarlagadda Venkatrao says he will resign from his post if the allegations are proven.

    yarlagadda venkatarao: ఆరోపణలు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

  • Poonam Pandey: నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పూనమ్ పాండే

  • Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd