HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nagababu Counter To Ycp Leaders Who Spoke About Megastar Chiranjeevi

Nagababu : మెగాస్టార్‌తో ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు.. ఆయన్నే అంటున్నారు.. చిరంజీవిపై వైసీపీ విమర్శలకు నాగబాబు కౌంటర్..

వైసీపీ చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) గట్టి కౌంటర్ ఇచ్చారు.

  • Author : News Desk Date : 09-08-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
nagababu minister post
nagababu minister post

ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) 200 డేస్ ఈవెంట్ లో చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ అంబటి(Ambati Rambabu) – బ్రో(Bro) సినిమా గొడవ గురించి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా సినిమాల మీద పడి ఏడుస్తారెందుకు అంటూ ఏపీ గవర్నమెంట్, అంబటి రాంబాబు పై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు.

దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనంగా మారాయి. ఇక ఇన్ని మాటలు అన్నాక వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా?? వరుసపెట్టి నిన్నటి నుంచి వైసీపీ మంత్రులంతా ఒక్కొక్కరు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే నేను ఒకప్పుడు చిరంజీవి అభిమానినే అంటూ విమర్శలు చేయడం గమనార్హం.

చిరంజీవి ఎలాగో వైసీపీ చేసే విమర్శలకు సమాధానం ఇవ్వరు. దీంతో వైసీపీ చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏ గొడవ జరిగినా దానికి కౌంటర్ గా ముందు ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేసేస్తారు నాగబాబు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చిరంజీవి మీద చేస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

నాగబాబు తన ట్వీట్ లో.. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ. ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు. ఒకప్పుడు ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఇప్పుడు ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది. అంటూ ఫైర్ అయ్యారు. ఇక చివర్లో NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది. ఆరోగ్యాలు జాగ్రత్త.! అని కొసరు వడ్డించారు నాగబాబు. మళ్ళీ దీనిపై కూడా ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శించినా విమర్శిస్తారు వైసీపీ నాయకులు. మరి ఈ మెగా వర్సెస్ వైసీపీ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

శ్రమని పెట్టుబడిగా పెట్టి,
పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి,
వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి ,
24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ..

ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు
నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు,ఆయన…

— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2023

 

Also Read : Minister Roja : ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడతారా.. చిరంజీవి వ్యాఖ్యలపై రోజా కౌంటర్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chiranjeevi
  • chiranjeevi comments
  • Janasena
  • nagababu
  • Pawan Kalyan
  • ycp leaders

Related News

Chiranjeevi

యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) నుంచి చిత్ర బృందం సరికొత్త హెచ్‌డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Janasena Meetting

    డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • Pawan Gift

    ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

Latest News

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

  • కాఫీ తాగితే న‌ష్టాలే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయ‌ట‌!

  • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

Trending News

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd