Minister Roja : ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడతారా.. చిరంజీవి వ్యాఖ్యలపై రోజా కౌంటర్..
వైసీపీ(YCP) నాయకులు రోజూ జనసేన(Janasena), పవన్(Pawan Kalyan) మీద ఫైర్ అవుతుంటే ఇప్పుడు చిరంజీవి కూడా మాట్లాడటంతో వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్స్ పెట్టి చిరంజీవిని విమర్శించారు.
- Author : News Desk
Date : 09-08-2023 - 4:39 IST
Published By : Hashtagu Telugu Desk
మొన్న జరిగిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) 200 డేస్ ఈవెంట్ లో చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ అంబటి(Ambati Rambabu) – బ్రో(Bro) సినిమా గొడవ గురించి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా సినిమాల మీద పడి ఏడుస్తారెందుకు అంటూ ఏపీ గవర్నమెంట్, అంబటి రాంబాబు పై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనంగా మారాయి.
ఇక వైసీపీ(YCP) నాయకులు రోజూ జనసేన(Janasena), పవన్(Pawan Kalyan) మీద ఫైర్ అవుతుంటే ఇప్పుడు చిరంజీవి కూడా మాట్లాడటంతో వైసీపీ నాయకులంతా ప్రెస్ మీట్స్ పెట్టి చిరంజీవిని విమర్శించారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్.. ఇలా అందరూ కట్టకట్టుకుని ఒకరి తర్వాత ఒకరు చిరంజీవి మీద పడ్డారు. రాష్ట్రాభివృద్ధి గురించి అడిగితే అది నీకెందుకు సినిమాలు చేసుకో అంటూ ఫైర్ అయ్యారు.
ఇక ఇలాంటి వాటికి కౌంటర్లు ఇచ్చే వైసీపీ బ్యాచ్ లో రోజా(Roja) ఇంకా రాలేదేంటి అని అంతా అనుకున్నారు. ఎట్టకేలకు రోజా ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ చిరంజీవిపై ఫైర్ అయింది.
రోజా మీడియాతో మాట్లాడుతూ.. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఒక్కరే. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే ముందు ఆయన తమ్ముడికివ్వాలి. బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్ ను అవమానించారు కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు. ఎందుకు కాంగ్రెస్ తో పోరాడి ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి లబ్ధి పొందింది చిరంజీవి. రాష్ట్రానికి నష్టం చేశారని ప్రజలు గమనించారు. చిరంజీవి చెప్తే వినే స్థాయిలో లేము. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సిన చిరంజీవి ఇలా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడడం సరికాదు అంటూ ఫైర్ అయింది. ఈ గొడవ ఇంకా ఎక్కడిదాకా తీసుకెళ్తారో చూడాలి.
Also Read : Conspiracy To Kill : నాపై హత్యాయత్నం.. చంపడానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారో తేలాలి : చంద్రబాబు