Chandrababu : చంద్రబాబు ను జైల్లో పెట్టడం అన్యాయం – మురళీ మోహన్
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై మరోసారి స్పందించారు నటుడు , మాజీ ఎంపీ మురళి మోహన్ (Murali Mohan).
- Author : Sudheer
Date : 02-10-2023 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
Murali Mohan about Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై మరోసారి స్పందించారు నటుడు , మాజీ ఎంపీ మురళి మోహన్ (Murali Mohan). స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 23 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రోల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను యావత్ ప్రజానీకం ఖండిస్తూ..ఆయనకు సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కు నిరసనగా సత్యమేవ జయతి అంటూ టిడిపి శ్రేణులు నిరాహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు జైల్లోనే దీక్ష చేస్తుండగా..లోకేష్ , భువనేశ్వరి , నందమూరి సుహాసిని వంటి కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు, తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారని మురళీ మోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర దీని గురించి చర్చించామని , ఆయన తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రాజ్‌ఘాట్ వెళ్లి అరగంట వేడుకున్నామని, ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్‌లో ఇప్పుడు సుహాసిని గారు నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని, ఒక మంచి ముఖ్యమంత్రిని ఈరోజు జైల్లో పెట్టడం అన్యాయమని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. ఆయనను వెంటనే విడుదల కావాలని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని ఆకాంక్షించారు. అరచేయితో సూర్యుని ఆపలేమని, గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో అందరికీ తెలుసునని, చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
Read Also : Roja Blue Film Issue : మిర్యాలగూడలో రోజా ఎవరితో గడిపారు? `బ్లూ ఫిల్మ్ ` నిజమేనా?