Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
- By Gopichand Published Date - 06:10 PM, Wed - 11 June 25

Railway Project: కేంద్ర కేబినెట్ సమావేశంలో బుధవారం (జూన్ 11, 2025) ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. ఈ ప్రాజెక్టులు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తాయి. దీనివల్ల సుస్థిర, సమర్థవంతమైన రైలు కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కోడెర్మా-బర్కాకానా మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోడెర్మా నుండి బర్కాకానా వరకు 133 కి.మీటర్ల డబుల్ లైన్‌కు ఆమోదం లభించింది. దీని ఖర్చు 3,063 కోట్ల రూపాయలు. దీనివల్ల పాట్నా- రాంచీ మధ్య దూరం తగ్గుతుంది. ఇది కోడెర్మా, చత్రా, హజారీబాగ్, రామ్‌గఢ్ జిల్లాలకు మంచి కనెక్టివిటీని అందిస్తుంది.
Also Read: RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!
ఝార్ఖండ్‌లో భారతీయ రైల్వే కోడెర్మా-బర్కాకానా మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. “నిపుణుల లెక్కల ప్రకారం.. ఈ ప్రాజెక్టు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఏడు కోట్ల చెట్లు నాటినంత సమానంగా తగ్గుతాయి. దీనివల్ల దేశంలో సంవత్సరానికి 32 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది. ఇది 938 గ్రామాలు, 15 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ లైన్ 30.4 మిలియన్ టన్నుల అదనపు సరుకును రవాణా చేయగలదు, ఇది రోడ్డు రవాణాతో పోలిస్తే పర్యావరణ దృష్ట్యా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.” అని పేర్కొన్నారు.
బళ్లారి-చిక్జాజూర్ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం కర్ణాటక- ఆంధ్రప్రదేశ్‌లలో భారతీయ రైల్వే బళ్ళారి-చిక్జాజూర్ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీనిని డబుల్ లైన్‌గా మార్చనున్నారు. దీనివల్ల మంగళూరు పోర్టుతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దీని గురించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్టు కింద 185 కి.మీ. రైల్వే లైన్‌ను డబులింగ్ చేయనున్నారు. దీనికి 3,342 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.” అని వివరించారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి మోదీ చారిత్రాత్మక మూడవ పదవీకాలంలో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. ఐఐఎమ్ బెంగళూరు, ఐఐఎమ్ కలకత్తా ఇటీవలి అధ్యయనం ప్రకారం రవాణా రంగంలో పెట్టుబడుల వల్ల దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు సుమారు 4 శాతం తగ్గింది.” అని ముగించారు.