HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mlc Marri Rajasekhar Resigns From Ysrcp

Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా

మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.

  • Author : Latha Suma Date : 19-03-2025 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Marri Rajasekhar resigns from YSRCP
MLC Marri Rajasekhar resigns from YSRCP

Marri Rajasekhar : గుంటూరు: వైసీపీకీ మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు పోతుల సురేష్, కళ్యాణ చక్రవర్తి, కర్తి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.

Read Also: Gold Price Today : ఇక సామాన్య ప్రజలు పసిడి కొనలేరు !

గత కొంతకాలంగా రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావు పై ఓటమిపాలయ్యారు. ఇక, రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం.

కాగా, 2019 ఎన్నికల్లో రాజశేఖర్‌కు సీటు ఇవ్వకుండా.. చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజని కి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజినికి ఈ మధ్యకాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజిని తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

Read Also: Space : అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chilakaluripet
  • Marri Rajasekhar
  • resignation
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd