Gold Price Today : ఇక సామాన్య ప్రజలు పసిడి కొనలేరు !
Gold Price Today : బంగారం ధరలు త్వరలోనే రూ. లక్షకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద చిక్కుగా మారనుంది
- By Sudheer Published Date - 10:57 AM, Wed - 19 March 25

బంగారం ధరలు (Gold Price) రోజు రోజుకు లక్ష వైపు పరుగులు పెడుతుండడం తో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక గోల్డ్ ను కొనే రోజులు పోయాయి అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు గోల్డ్ ధర (Gold Price Today) చూస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 82,900కు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 440 పెరిగి రూ. 90,440కు చేరింది. బంగారం ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆభరణాల కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయాల్లో బంగారం ధరల పెరుగుదల ప్రజలను ఆర్థికంగా ప్రభావితం చేస్తోంది.
Sunita Williams : సునితా విలియమ్స్ సొంతూరు, కెరీర్, వివాహం.. విశేషాలివీ
బంగారం మాత్రమే కాకుండా వెండి ధర కూడా బంగారం తో పరుగులు పెడుతుంది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1000 పెరిగి రూ. 1,14,000కు చేరుకుంది. ఇది వెండి కొనుగోలు దారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో పాటు స్థానికంగా పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా భారత్‌లోనూ భారీ ప్రభావం పడుతోంది.
IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!
ప్రస్తుత పరిస్థితి చూస్తే.. బంగారం ధరలు త్వరలోనే రూ. లక్షకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద చిక్కుగా మారనుంది. పెరుగుతున్న ధరలను అంచనా వేసుకుని ప్రజలు ముందుగా బంగారం కొనుగోలు చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున పెట్టుబడి దారులు దీనిని లాభదాయక అవకాశంగా భావిస్తున్నారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలపై అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.