HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Narayana Fires On Ycp

Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Narayana fires on YCP
Minister Narayana fires on YCP

అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగుపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి… ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు.

గెజిటెడ్ అధికారుల నివాసాల టెండర్ రూ.1,003 కోట్లకు, చదరపు అడుగుకు రూ.3,684 చొప్పున కేటాయించబడిందని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టెండర్ రూ.1,234 కోట్లకు, చదరపు అడుగుకు రూ.3,945 చొప్పున అమలవుతోందని వివరించారు.

అమరావతి అభివృద్ధిలో భాగంగా సీఆర్డీఏ మొత్తం 69 వంతెనలను నిర్మిస్తోందని మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రధాన వాగులపై 43 వంతెనలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. వంతెనల సమీపంలో పేరుకుపోయిన మట్టి, తాత్కాలిక కట్టలు, ఇతర అడ్డంకులను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు జేసీబీలను వినియోగించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వచ్చే ఏడాదిలోగా 69 వంతెనల్లో అధిక భాగం పూర్తవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ప్రతిపక్ష నేతలకు సూచించిన ఆయన, ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • andhra politics
  • AP CRDA
  • CM YS Jagan Mohan Reddy
  • Minister Narayana

Related News

Chandrababu

Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్

  • CM Chandrababu is the person who made gems rain in Rayalaseema: Minister Nara Lokesh.

    Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Latest News

  • Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

  • Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

  • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

  • Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd