Minister Nara Lokesh: గల్ఫ్ బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్!
పొట్టకూటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు.
- By Gopichand Published Date - 11:22 AM, Fri - 27 December 24

Minister Nara Lokesh: గల్ఫ్ బాధితురాలికి మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అండగా నిలిచారు. మస్కట్ లో చిక్కుకున్న కోనసీమ జిల్లా వాసి వాసంశెట్టి పద్మకు ఆయన బాసటగా నిలిచారు. కోనసీమ జిల్లా వాసి వాసంశెట్టి పద్మ రక్షించాలంటూ ఎక్స్ ద్వారా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వీడియో మంత్రి నారా లోకేష్‌కు చేరింది. మంత్రి చొరవతో స్వదేశానికి చేరారు.
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సమస్య ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి అండగా నిలుస్తున్నారు. పొట్టకూటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ కు వెళ్లారు.
Also Read: PM Modi Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
అక్కడకు వెళ్లిన తర్వాత పాస్ పోర్ట్ పోగొట్టుకోవడంతో పాటు యజమాని పెట్టే ఇబ్బందులు తాళలేక అస్వస్థతకు గురయ్యారు. తనను రక్షించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే స్పందించిన మంత్రి.. తన టీం ద్వారా వాసంశెట్టి పద్మను స్వదేశానికి రప్పించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. సాయం కోరిన వెంటన స్పందించి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.