Visakhapatnam: విశాఖపట్నంలో ఇద్దరు కూతుర్లను చంపి.. తండ్రి ఆత్మహత్య
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం (Visakhapatnam)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
- Author : Gopichand
Date : 20-01-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
అనారోగ్యంతో భార్య మృతి చెందడం ఓ వైపు.. ఆర్థిక ఇబ్బందులు మరో వైపుతో తీవ్ర మనోవేదనకు గురై ఓ తండ్రి ఇద్దరు కుతూర్లను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ సంఘటన విశాఖపట్నంలో గురువారం చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం (Visakhapatnam)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం మెట్టు ప్రాంతంలో జరిగింది. అయితే దీనికి కారణం ఆర్థిక బాధలు తట్టుకోలేకపోవడమేనని పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చారు. కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పిల్లా దుర్గా ఆంజనేయ ప్రసాద్ (42)గా గుర్తించారు. అతను నాగమణి అనే మహిళని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Also Read: CBI Court : బెంగాల్ మాజీ మంత్రి పార్థచటర్జీ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సీబీఐ కోర్టు
ఇది అతని తల్లి అనసూయకు ఇష్టం లేదు. దీంతో దుర్గాప్రసాద్ కంచరపాలానికి వెళ్లకుండా చాలాకాలం భార్యతో కలిసి ఏలూరులోనే కాపురం ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. బిందు (15), భార్గవి (13) ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఎలక్ట్రికల్ పనులు, ప్లంబింగ్ పనులు చేసేవాడు. ఆయన భార్య నాగమణి అనారోగ్యంతో 2013లో అనుకోకుండా చనిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకుని తిరిగి విశాఖపట్నం చేరాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అతడిని ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకోలేని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు.