Lulu Malls : ఏపీలో లులు గ్రూప్ పెట్టుబడులు..ఆ మూడు నగరాల్లో లులు మాల్స్
Lulu Malls : విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఇప్పటికే ఆమోదం తెలిపింది
- By Sudheer Published Date - 10:19 AM, Tue - 18 March 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన లులు గ్రూప్(Lulu Group)ను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అమరావతి, తిరుపతిల్లోనూ లులు మాల్స్ నిర్మాణానికి సంస్థ ఆసక్తి చూపుతోంది. 2014-19 టీడీపీ హయాంలో విశాఖలో లులు మాల్ కోసం సాగర తీరంలో భూమిని కేటాయించారు. కానీ 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం లులుతో సంప్రదింపులు జరిపి, పెట్టుబడులను మరోసారి రాష్ట్రానికి తీసుకురావడం విశేషం.
Skin Tight Jeans : అమ్మాయిలు మీరు స్కిన్ టైట్ జీన్స్ ధరిస్తున్నారా..? మీకు వచ్చే సమస్యలు ఇవే !
అంతేగాక అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించగా ప్రధాని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ఇండోసోల్ సంస్థ సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమను స్థాపించేందుకు అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలోని చేనేతల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?
ఇక రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.5,530 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) 70% నిధులను అందించనుండగా మిగిలిన 30% వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి, పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. లులు మాల్స్ ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యాలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.