Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?
వ్యోమగాములు తినడానికి ఐఎస్ఎస్‌లో(Astronauts Daily Routine) తగినంత ఆహారం, నీరు ఉంటాయి.
- By Pasha Published Date - 08:57 AM, Tue - 18 March 25

Astronauts Daily Routine: అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. కేవలం 8 రోజుల స్పేస్ మిషన్ కోసం వెళ్లిన ఆమె.. అక్కడే చిక్కుకుపోయి ఏకంగా 9 నెలలు గడపాల్సి వచ్చింది. సునితను త్వరగా భూమికి తీసుకొచ్చేందుకు గత బైడెన్ సర్కారు చొరవ చూపలేదు. ఎట్టకేలకు ట్రంప్ ప్రభుత్వం వచ్చాక, ఆ దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. మార్చి 19వ తేదీన మధ్యాహ్నం కల్లా సునితా విలియమ్స్ మళ్లీ భూమిపై అడుగు పెట్టనున్నారు. ఈసందర్భంగా అంతరిక్షంలో వ్యోమగాముల జీవన శైలి గురించి మనం తెలుసుకుందాం..
Also Read :Titanium Heart : టైటానియం గుండె వచ్చేసింది.. 105 రోజులుగా బతుకుతున్న హృద్రోగి
అంతరిక్షంలో వ్యోమగాముల దినచర్య ఇలా..
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 108 మీటర్ల పొడవు, 120 మీటర్ల లోతు, 24 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. 6 బెడ్‌రూమ్‌ల ఇంటి సైజులో ఐఎస్ఎస్ ఉంటుంది.
- ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో సునీతా విలియమ్స్, విల్‌మోర్ సహా మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో నలుగురు అమెరికన్లు, ముగ్గురు రష్యన్లు, ముగ్గురు చైనీస్.
- వ్యోమగాములకు ఐఎస్ఎస్ నుంచి తమ కుటుంబంతో మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయి.
- నాసా రూపొందించిన పరికరాలతో ఐఎస్ఎస్‌లో ప్రత్యేక జిమ్ ఉంది.
- ఈ జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్‌డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైస్ (ఏఆర్ఈడీ) యంత్రం ఉంది. వ్యోమగాములు పరుగెడుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా పట్టీలతో కూడిన ట్రెడ్‌మిల్ ఉంది.
- ఐఎస్ఎస్‌లో ఉండే వ్యోమగాముల చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగునీటిగా మారుస్తారు. తాగడానికి అవసరమైన నీటిని ఇలాగే పొందుతారు.
Also Read :Nagpur Violence: నాగ్‌పూర్‌లో అల్లర్లు.. అమల్లోకి 144 సెక్షన్.. కారణం అదే ?
- వ్యోమగాములు తినడానికి ఐఎస్ఎస్‌లో(Astronauts Daily Routine) తగినంత ఆహారం, నీరు ఉంటాయి.
- అక్కడికి ఆహారం, నీటిని చేరవేసేందుకు ప్రత్యేకంగా వ్యోమగాములతో రాకెట్లను పంపుతుంటారు.
- ఐఎస్ఎస్‌లో ఉండే ఒక వ్యోమగామికి ప్రతిరోజు సగటున 1.7 కేజీల ఫుడ్ అవసరం. ఇందులో తృణధాన్యాలు, పాల పొడి, పిజ్జా, రొయ్యల కాక్‌టెయిల్, వేయించిన చికెన్, ట్యూనా చేపలు మొదలైనవి ఉంటాయి.
- ఐఎస్ఎస్‌లో ఉండే వ్యోమగాములు వాటిని వేడి చేసుకుని మాగ్నెటైజ్డ్ ట్రేలలో తింటారు.
- వ్యోమగాములతో నాసా సైంటిస్టులు టచ్‌లో ఉంటారు. నాసా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లలో ఐఎస్ఎస్ వ్యోమగాములు పాల్గొంటారు.
- ఐఎస్ఎస్‌లో జరుగుతున్న రిపేరింగ్ పనులు, స్టేషన్‌కు చేయాల్సిన మరమ్మతుల గురించి నాసా సైంటిస్టులు ఎప్పటికప్పుడు వ్యోమగాములను ఆరా తీస్తుంటారు.