Skin Tight Jeans : అమ్మాయిలు మీరు స్కిన్ టైట్ జీన్స్ ధరిస్తున్నారా..? మీకు వచ్చే సమస్యలు ఇవే !
Skin Tight Jeans : ఇవి గ్లామర్ పెంచినప్పటికీ, దీర్ఘకాలంగా ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
- By Sudheer Published Date - 10:09 AM, Tue - 18 March 25

ప్రస్తుత కాలంలో స్కిన్ టైట్ జీన్స్ (Skin Tight Jeans) ఫ్యాషన్ ప్రపంచంలో విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా యువతలో అమ్మాయిలు స్టైలిష్ లుక్ కోసం తరచుగా టైట్ గా ఉండే జీన్స్(Skin Tight Jeans)ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి గ్లామర్ పెంచినప్పటికీ, దీర్ఘకాలంగా ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మంపై ఒత్తిడి పెరగడం, రక్త ప్రసరణ మందగించడం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొంత మంది అమ్మాయిలకు ఇవి అసౌకర్యంగా అనిపించినప్పటికీ, అందమైన రూపం కోసం వాటిని నిర్లక్ష్యం చేయడం సాధారణంగా మారింది.
Co-Living : హైదరాబాద్ లో విస్తరిస్తున్న కో-లివింగ్ సంస్కృతి
టైట్ గా ఉండే జీన్స్ చర్మాన్ని గట్టిగా ఒడిసి పట్టుకోవడంతో చెమట బయటకు వెళ్లే మార్గం లేకుండా పోతుంది. దీని వలన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు, రాషెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొడలు, మడమల వద్ద ఎక్కువగా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బిగుతుగా ఉండే జీన్స్ కడుపుపై ఒత్తిడి పెంచి, జీర్ణవ్యవస్థను దెబ్బతీసే అవకాశముంది. దీని వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయి. అదనంగా, రక్త ప్రసరణ మందగించడం వల్ల కాళ్లలో నొప్పులు, వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది.
Amitabh Bachchan : షారుఖ్ ని మించి ట్యాక్స్ కట్టిన అమితాబ్.. వామ్మో అన్ని కోట్లా?
ఈ సమస్యలను నివారించేందుకు అమ్మాయిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఎక్కువ టైట్ గా ఉండే జీన్స్‌ను ఎంచుకోవడం మానేసి, కొంత సౌకర్యవంతంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. నడుము భాగంలో ఒత్తిడి రాకుండా ఉండే విధంగా సరైన సైజును ఎంపిక చేసుకోవాలి. స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్స్‌తో తయారైన జీన్స్ ధరించడం మంచిది. ఎక్కువ సేపు జీన్స్ ధరించకుండా, అవసరమైన సమయంలో వదులుగా ఉండే దుస్తులను ధరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్యాషన్, స్టైల్ ఎంత ముఖ్యమైనవో, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం అంతే అవసరం!