HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Vs Chidambaram Heated Row Over Delimitation Erupts On X

Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh vs. Chidambaram: Heated Row Over Delimitation Erupts on X
Lokesh vs. Chidambaram: Heated Row Over Delimitation Erupts on X

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్‌.. లోకేశ్‌ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

లోకేశ్‌ ఏమన్నారు?
‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్‌ కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు. ఈ బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్ల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనివల్ల తమిళనాడు, కేరళ ఏడు స్థానాలు, ఆంధ్రప్రదేశ్ మూడు, తెలంగాణ ఒక లోక్‌సభ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

చిదంబరం కౌంటర్
లోకేశ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నా యువ మిత్రుడు లోకేశ్‌ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు కాస్త లెక్కలు సరిచూసుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లు వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందని చెప్పారు. సీట్లను యాభై శాతం పెంచినా లాభం ఉత్తరాది రాష్ట్రాలకేనని, ఏపీ సీట్లు 25 నుంచి 38కి పెరిగినా మొత్తం సీట్లలో ఏపీ వాటా తగ్గిపోతుందని వాదించారు.

లోకేశ్‌ రీ-కౌంటర్
చిదంబరం ట్వీట్‌పై మంత్రి లోకేశ్‌ అంతే వేగంగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల ఫ్రీజ్ 2026 జనాభా లెక్కల తర్వాత ముగుస్తుందని గుర్తుచేశారు. ఆ తర్వాత పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గడం ఖాయమన్నారు. ఈ నష్టాన్ని ఆపడానికే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తెచ్చిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ బిల్లును పార్లమెంట్‌లో ఎందుకు అడ్డుకున్నారో చిదంబరం చెప్పాలని లోకేశ్‌ నిలదీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh IT minister Nara Lokesh
  • ap politics
  • Delimitation
  • Lok Sabha seats
  • P Chidambaram
  • population census

Related News

Fans Chant:

Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్‌లోని

    Latest News

    • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

    • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

    • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd