HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kurnool Bus Accident Four Members Of The Same Family Die

Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.

  • Author : Gopi Date : 24-10-2025 - 9:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kurnool Bus Accident
Kurnool Bus Accident

Kurnool Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) దేశవ్యాప్తంగా విషాదం నింపింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ‘వేమూరి కావేరీ’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయినట్లుగా తెలుస్తోంది.

ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), ఆయన భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు. బెంగళూరులో స్థిరపడిన ఈ కుటుంబం హైదరాబాద్ వెళ్లి తిరిగి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో మ‌ర‌ణించారు. వీరి మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

ప్రమాద వివరాలు

బస్సు పటాన్ చెరులో రాత్రి 9.30 గంటల సమయంలో బయలుదేరి, హైదరాబాద్‌లోని వివిధ స్టాపుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరింది. చిన్నటేకూరు వద్ద బస్సు కింద ఒక ద్విచక్ర వాహనం చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారని, కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారని స్థానికులు చెబుతున్నారు. బస్సులో చిక్కుకున్న 25 మందికి పైగా ప్రయాణికులు మంటల్లో కాలిపోయిన‌ట్లు తెలుస్తోంది.

సంచలన విషయాలు వెలుగులోకి

ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ‘వేమూరి కావేరీ’ ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసింది. అంతేకాక ఈ బస్సు ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిశాయి. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన బస్సును నడపడం, అతివేగం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Fire Accident
  • kurnool
  • Kurnool Bus Accident
  • Sad News
  • telugu news

Related News

Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ప్రస్తుతం ముంబైలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణతో పాటు ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల స

    Latest News

    • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

    • Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

    • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

    • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

    • Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd