Kondapalli : కొండపల్లి మున్నిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ.. ఎంపీ కేశినేని ఓటు చెల్లుతుందా..? లేదా..?
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయితీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడం పై
- Author : Prasad
Date : 11-08-2022 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయితీలో ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడం పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ కు విచారణ అర్హత లేదని కొండపల్లి వైసిపి కౌన్సిలర్‌ల తరపున వేసిన పిటీషన్ ఈ రోజు(గురువారం) విచారణ జరిగింది. ఇటువంటి పిటీషన్‌లకు హైకోర్టులో విచారణ అర్హత లేదని , సివిల్ కోర్టుకు వెళ్లాలని వైసిపి కౌన్సిలర్‌ల తరపున న్యాయవాది సీతారాం వాదనలు వినిపించారు.
ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్‌ల తరపున న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ఈ సందర్బంగా అశ్వినీ కుమార్ ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం నానీ పిటీషన్‌కు విచారణ అర్హత ఉందని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీ కేశినేని నానీ ఓటు చెల్లుతుందా లేదా అనే అంశం పై తదుపరి విచారణలో తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.