Kodikathi Srinu : జైల్లో ఆమరణ దీక్ష కు సిద్దమైన కోడి కత్తి శ్రీను
- By Sudheer Published Date - 05:39 PM, Wed - 17 January 24

కోడి కత్తి కేసు (Kodikathi Case)లో గత ఐదేళ్లుగా జైల్లో ఉన్న శ్రీను (Kodikathi Srinu)..రేపటి నుండి ఆమరణ దీక్ష కు సిద్దమయ్యాడు. తన కుమారుడు 5 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాడని, ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. జైలులో రేపటి నుంచి శ్రీను ఆమరణ దీక్ష చేస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
2019 ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత, విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన వ్యవహారంలో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అప్పటి నుంచీ జైల్లోనే ఉన్నాడు. శ్రీనివాస్ కు బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే. దీంతో చేసేది లేక శ్రీనివాస్, ఆయన కుటుంబం ఆమరణదీక్షకు దిగుతున్నారు. అసలు దాడి చేసింది శ్రీనివాస్ కాదని, వైసీపీ నేత మజ్జి శ్రీను అంటూ ఆయన లాయర్లు కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు సీఎం జగన్ వచ్చి వాంగ్మూలం చెప్తే ఈ కేసును ముగించేందుకు కోర్టు కూడా సిద్ధంగానే ఉంది. అయినా సీఎం జగన్ ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదు. దీంతో ఆయన లాయర్లు, కోర్టు కూడా ఏంచేయలేకపోతుంది. మరి శ్రీను ఆమరణ దీక్ష కు సిద్దమైన నేపథ్యంలో జగన్ మనసు కరుగుతుందో చూడాలి.
Read Also : Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..