Boppana Bhava Kumar : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన బొప్పన భవకుమార్..
- By Sudheer Published Date - 05:29 PM, Wed - 17 January 24

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ వైసీపీ (YCP) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్ (Jagan) సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించకపోవడం తో చాలామంది నేతలు వైసీపీ కి గుడ్ బై చెప్పి..టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..ఇప్పుడు వైసీపీ కీలక నేత బొప్పన భవకుమార్ (Boppana Bhava Kumar) సైతం టీడీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
విజయవాడ నగర వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్ ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ను కలిశారు. ఆయనతో పాటు అనుచరులు వైసీపీ ని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వంగవీటి రాధా, కేశినేని శివనాథ్ (చిన్ని), గద్దె రామ్మోహన్ తదితర నేతలతో చర్చలు జరిపారు. బుజ్జగించేందుకు దేవినేని అవినాష్..తదితర వైసీపీ నేతలు రంగంలోకి దిగినప్పటికీ.. ఆ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని, అక్కడ కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీ లో చేరనున్నట్టు తెలుస్తుంది. 2019లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గద్దె రామ్మోహన్‌పై భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధితో కలిసి ఈ నెల 21న టీడీపీలో భవకుమార్ చేరుతున్నట్లు తెలుస్తోంది.
Read Also : AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ