ACA : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నిక
ACA : ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
- By Latha Suma Published Date - 02:13 PM, Sun - 8 September 24

Andhra Cricket Association Elections : ఎంపీ కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
తొలి నిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం శుభపరిణామమని పేర్కొన్నారు. తొలి నిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం వరద బాధితులకు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో వసతులతో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా ఉందన్నారు. ఇకపై మంగళగిరి, కడపల్లో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా కృషి చేస్తామని ఎంపీ కేశినేని హామీ ఇచ్చారు.
కాగా, ఆదివారం విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆదివారం ఎన్నికలు జరగాలి. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాది పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆగస్టు 16వ తేదీన నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
Read Also: Moving Ganesh : కన్నుల పండుగ చేస్తున్న కదిలే వినాయకుడు.. 36వేల ముత్యాలతో…