Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 09:16 AM, Mon - 11 March 24

Mudragada Padmanabham: మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆదివారం కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాడేపల్లి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
మార్చి 14న సాయంత్రం 6 గంటలకు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షతో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎలాంటి పదవి అక్కర్లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేసేందుకు మాత్రమే తాను పార్టీలో చేరుతున్నట్లు ముద్రగడ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు.
Also Read; Andhra Pradesh: మచిలీపట్నంలో పేర్ని వర్సెస్ బాలశౌరి