Jerry In Tirumala Annadanam Center: తిరుమల అన్నదాన కేంద్రంలో జెర్రి కలకలం.. వీడియో
టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు.
- By Gopichand Published Date - 05:51 PM, Sat - 5 October 24

Jerry In Tirumala Annadanam Center: తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి (Jerry In Tirumala Annadanam Center) కలకలం రేపింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనిపించింది. అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అక్కడ్నుంచి భక్తులను వెళ్లిపోమన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Megastar Injured: మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం.. వీడియో వైరల్
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి
టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి
అన్నప్రసాదంలో జెర్రి కనపడటంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు
టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని… pic.twitter.com/yJXwbBL5tj
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2024
దీనికి కారకులైన వారిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై టీటీడీ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే ఇది ఎప్పుడో జరిగిందో తెలియరాలేదు. ఈరోజు ఉదయమే భక్తలతో నడవడిక, అన్నదానంపై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ఇటీవల లడ్డూ ప్రసాదంలో గుట్కా కవర్లు
ఇటీవల లడ్డూ ప్రసాదంలో కూడా గుట్కా ప్యాకెట్లు వచ్చినట్లు భక్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. గత నెల 19వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవారి భక్తులు తిరుమల వెళ్లి వచ్చారు. ఆ తర్వాత లడ్డూ ప్రసాదాలను పంచే క్రమంలో ఓ లడ్డూలో గుట్కా కవర్లు, పలుకులు వచ్చినట్లు భక్తులు ఆరోపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో పై స్పందించిన టీటీడీ ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని భక్తులను కోరింది. తాజాగా అన్నదాన కేంద్రంలోనే జెర్రి కనిపించటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
జగన్ ప్రభుత్వం హయాంలో టీటీడీ పాలకమండలి అనేక తప్పులు చేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలపై ప్రతిపక్ష వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తోంది. టీటీడీ పాలకమండలి భక్తులకు సరైన వసతులు ఏర్పాటు చేయాలని, సిబ్బంది భక్తులతో స్నేహాపూర్వకంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం ఉదయం టీటీడీ సిబ్బందితో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు.