New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ ..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీలో మరో కొత్త పార్టీ (New Political Party) పురుడుపోసుకుంది.
- Author : Gopichand
Date : 23-12-2023 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
New Political Party: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. వీటికి తోడు మేము కూడా బరిలో దిగుతామంటూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో మరో కొత్త పార్టీ (New Political Party) పురుడుపోసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణగా పేరుగాంచిన మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారం జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి పార్టీ పుట్టిందని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేనలు పక్కనపెట్టిన ప్రత్యేక హోదాను మళ్లీ ప్రధాన చర్చకు తీసుకువస్తామని చెప్పారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ పార్టీకి జెడి నినాదాన్ని కూడా ప్రారంభించారు. “అప్పు చెయ్యం తప్పు చెయ్యం” అనేది నినాదం.
Also Read: Oscar Challagiriga : కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినీగా ‘ఆస్కార్ చల్లగరిగ’
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నట్లు తెలిపారు. తమ పార్టీ పెట్టిన పార్టీ కాదన్న ఆయన ప్రజల్లో అభిప్రాయాల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని, ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత చాలా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనికి ప్రధాన కారణం… సరైన పాలసీలు లేకపోవటమే కారణమన్నారు. ఏపీని గుజరాత్ కంటే ముందువరుసలో ఉంచటమే తన లక్ష్యమని చెప్పారు. అలాగే బూటకపు రాజకీయాలకు స్వస్తి పలకాలని జేడీ పిలుపునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.