HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Janasena Focus On Rayalaseema

Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?

  • Author : Prasad Date : 26-05-2026 - 1:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balineni
Balineni

రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవ‌ల‌ను రాయ‌ల‌సీమ‌లో వినియోగించుకోవాల‌ని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన అధిష్ఠానం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాలినేనికి మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడపతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా బాలినేనికి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి నాయకులను జనసేనలోకి తీసుకురావడంపై కూడా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రాయలసీమలో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బాలినేనికి సంబంధించిన బాధ్యతలపై జనసేన అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలపై రాజకీయల‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • balineni srinivas reddy
  • Janasena
  • JSP
  • Pavan kalyan
  • Rayalaseema

Related News

ACB raids

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

  • Apollo Hospitals' Dr. Preetha Reddy Meets CM Chandrababu

    Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ

  • Religious Organizations Brought Under the Ambit of the RTI Act

    Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Thalliki Vandanam

    Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

Latest News

  • Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు కవిత

  • YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?

  • HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

  • Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd