Nellore : రాజకీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె.. ఫస్ట్ ప్రెస్‌మీట్‌లోనే అదరగొట్టిన సాయివైష్ణవి
- Author : Prasad
Date : 25-05-2026 - 7:39 IST
Published By : Hashtagu Telugu Desk
నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కీలకంగా మారబోతుంది. గత ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలో టీడీపీ తన దూకుడిని ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాలు బరిలోకి వస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో ఆమె తన తండ్రి గెలుపుకోసం ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఫుల్‌టైం పాలిటిక్స్‌లోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టారు. నియోజకవర్గంలో కనీసం పది మంది నాయకులు పేర్లు అయిన తెలుసా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆగకుండా 150 మంది పేర్లను చదివారు. తన తండ్రితో పాటు తాను ప్రజలకు సేవచేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పెట్టుబడులు తీసుకువస్తున్నారని ఆమె తెలిపారు.
నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని సాయి వైష్ణవి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి మంత్రి నారా లోకేష్ కృషి తో భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని కోటంరెడ్డి సాయి వైష్ణవి అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్టానికి పెట్టుబడులు తీసుకువస్తుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ లో 658 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని.. త్వరలోనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేరుకుంటుందని ఆశిస్తున్నానని కోటంరెడ్డి సాయి వైష్ణవి తెలపారు. తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ ఒక కంచుకోటని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకి వంద శాతం గెలిచేందుకు అందరం కష్టించి పనిచేద్దామని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.