Pawan Kalyan : ప్రశ్నిస్తే కేసులు..కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేదు..ఇదీ ఏపీలో పరిస్థితి..!!
- Author : hashtagu
Date : 30-10-2022 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టరు. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. అందుకే వారితో మాట్లాడాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలు భయపడతాయన్న భయంతోనే జనవాణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈమధ్యే విశాఖ ఎయిర్ పోర్టు ఘటన నుంచి జైల్లో ఉన్న 9 మంది జనసేన నేతలు విడుదలయ్యారు. వారిని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన వారితోపాటు వారి కుటుంబాలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన వారికి పవన్ శాలువాలు కప్పి సన్మానం చేశారు. వారితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసకున్నారు. భవిష్యత్తులోనూ పోరాటాలు చేయాలని…మీకు పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు
* రౌడీలు రాజ్యాలు ఏలకూడదు
* అక్రమ నిర్భందాలకు జనసేన వెరవదు
* ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణి అడ్డుకున్నారు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ నేతల ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/b88WJJ43Gb
— JanaSena Party (@JanaSenaParty) October 29, 2022