Jagan Gunmen: వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్‌మెన్లు.. వీడియో వైరల్!
అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు.
- Author : Gopichand
Date : 14-08-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Jagan Gunmen: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం పర్యటనలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక వివాహ వేడుక అనంతరం ఆయన భద్రతా సిబ్బంది (Jagan Gunmen) ఒక వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకోవడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
అనంతపురం జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన జగన్.. తిరిగి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్ వద్ద భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు గుమిగూడారు. అభిమానులు, కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగింది. జగన్ తన కారుపై నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ తోపులాట మరింత పెరిగింది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్రశంసలు!
వైసీపీ కార్యకర్తపై చేయిచేసుకున్న జగన్ గన్‌మెన్లు
అనంతపురంలో జరిగిన ఒక వివాహ వేడుక అనంతరం వైసీపీ కార్యకర్తలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గన్‌మెన్లు దాడికి పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలో వాహనంపైకి ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో భారీ సంఖ్యలో ఉన్న కార్యకర్తల మధ్య… pic.twitter.com/fw77FAEprn
— ChotaNews App (@ChotaNewsApp) August 14, 2025
ఈ తోపులాటను నియంత్రించే క్రమంలో జగన్ గన్‌మెన్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో భద్రతా సిబ్బందిలో ఒకరు గుంపులో ఉన్న ఒక వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు. ఆ కార్యకర్తను గన్‌మెన్ పదేపదే కొట్టడం, నెట్టివేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. గన్‌మెన్ దాడిని చాలామంది తీవ్రంగా ఖండించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తపైనే ఇలా వ్యవహరించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ వర్గాలు కానీ, జగన్ కార్యాలయం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వీడియో ఇప్పుడు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.